తిరుమల, 6 జూలై (హి.స.)కలియుగ దైవం శ్రీవెంకటేశ్వర స్వామివారి తిరుమల (Tirumala) తిరుపతి కొండపై భక్తుల (Devotees) రద్దీ కొనసాగుతోంది. వారంతం కావటంతో భక్తులు భారీగా తరలివచ్చారు. దీంతో కంపార్ట్ మెంట్లన్నీ (all compartments ) భక్తులతో నిండిపోయాయి. బయట కృష్ణతేజ గెస్ట్ హౌస్ వరకు క్యూ లైన్లు విస్తరించాయి. మామూలుగానే శుక్రవారం, శనివారం, ఆదివారాలు తిరుమలలో భక్తుల రద్దీ కాస్తా ఎక్కువగానే ఉంటుంది. అందుకే వీకెండ్‌లో మూడు రోజుల పాటు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తారు. ఇక స్వామివారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. ఇక శనివారం అర్థరాత్రి వరకు శ్రీవారిని 87,536 మంది భక్తులు దర్శించుకోగా, 35,120 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. వెంకన్న హుండీ ఆదాయం రూ.3.33 కోట్లు సమకూరినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి