తొలి ఏకాదశి.. శ్రీశైలం మల్లన్న ఆలయానికి పోటెత్తిన భక్తజనం
శ్రీశైలం, 6 జూలై (హి.స.): నంద్యాల జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలం ముక్కంటి మల్లన్న ఆలయానికి తొలి ఏకాదశి కావడంతో భక్తుల రద్దీ పెరిగింది. తొలి ఏకాదశి కావడంతో స్వామి అమ్మవార్లకు మొక్కులు తీర్చుకునేందుకు దర్శనానికి భారీగా తరలివచ్చిన భక్తులతొ క్ష
శ్రీశైలం


శ్రీశైలం, 6 జూలై (హి.స.): నంద్యాల జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలం ముక్కంటి మల్లన్న ఆలయానికి తొలి ఏకాదశి కావడంతో భక్తుల రద్దీ పెరిగింది. తొలి ఏకాదశి కావడంతో స్వామి అమ్మవార్లకు మొక్కులు తీర్చుకునేందుకు దర్శనానికి భారీగా తరలివచ్చిన భక్తులతొ క్షేత్రమంత సందడి వాతావరణం నెలకొంది. భక్తులు వేకువజామున నుండే పాతాళగంగలో పుణ్య స్నానాలు ఆచరించి శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనార్థమై క్యూలైన్ లో దర్శనం కంపార్టుమెంట్లలో బారులు తీరారు. శ్రీ స్వామి అమ్మవార్ల దర్శనానికి సుమారు 2 గంటల సమయం పడుతుంది.

మరోపక్క భక్తులు రద్దీ దృష్ట్యా శని, ఆది, సోమవారలో ఆర్జిత అభిషేకాలు, కుంకుమార్చన నిలుపుదల చేసిన అధికారులు, సామాన్య భక్తులకు ఉచిత, శీఘ్ర, అతిశీఘ్ర, దర్శనానికి క్యూలైన్ల ద్వారా స్వామి అమ్మవార్లను దర్శించుకుంటున్నారు. ఆన్లైన్లో వీఐపీ బ్రేక్ టికెట్లు బుక్ చేసుకున్న భక్తులకు మూడు విడతలుగా ఉదయం 7:30 కు మధ్యాహ్నం 2.30కు రాత్రి 9 గంటలకు మాత్రమే(BREAK) స్పర్శ దర్శనానికి అనుమతిస్తున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయ క్యూలైన్లలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా శ్రీ స్వామి అమ్మవార్లను దర్శించుకునేలా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. దర్శనార్థమై క్యూలైన్లు, కంపార్ట్మెంట్లలో ఉన్న భక్తులకు ఎప్పటికప్పుడు అల్పాహారం, బిస్కెట్స్ మంచినీరు అందిస్తున్నామని దేవస్థానం అధికారులు తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి


 rajesh pande