నిండు కుండలా శ్రీశైలం జలాశయం.. భద్రమేనా?
శ్రీశైలం, 6 జూలై (హి.స.) శ్రీశైలం ప్రాజెక్టుకు సంబంధించి కొత్త గేట్లు ఏర్పాటు చేయకపోతే తుంగభద్ర పరిస్థితి ఎదురయ్యే ప్రమాదం ఉందని ప్రాజెక్టు గేట్ల నిపుణుడు ఎన్‌. కన్నయ్య నాయుడు హెచ్చరించారు. యన ఆదివారం శ్రీశైలం ప్రాజెక్టును పరిశీలించారు. ప్రాజెక్టు
నిండు కుండలా శ్రీశైలం జలాశయం.. భద్రమేనా?


శ్రీశైలం, 6 జూలై (హి.స.)

శ్రీశైలం ప్రాజెక్టుకు సంబంధించి కొత్త గేట్లు ఏర్పాటు చేయకపోతే తుంగభద్ర పరిస్థితి ఎదురయ్యే ప్రమాదం ఉందని ప్రాజెక్టు గేట్ల నిపుణుడు ఎన్‌. కన్నయ్య నాయుడు హెచ్చరించారు. యన ఆదివారం శ్రీశైలం ప్రాజెక్టును పరిశీలించారు. ప్రాజెక్టు గేట్ల నిపుణుడు ఎన్‌. కన్నయ్య నాయుడును జల వనరుల శాఖ (మెకానికల్‌) సలహాదారుగా ప్రభుత్వం నియమించిన విషయం తెలిసిందే. ఆనకట్ట రేడియల్‌ క్రస్ట్‌గేట్ల పరిస్థితిని క్షుణ్ణంగా పరిశీలించిన ఆయన.. పదో నంబర్‌ గేట్ ద్వారా వచ్చే లీకేజీ వల్ల ఇబ్బందేమీ లేదన్నారు.

గేటు నుంచి నీటి లీకేజీ 10 శాతం కంటే తక్కువగా ఉందని తెలిపారు. రేడియల్‌ క్రస్ట్‌ గేట్లకు క్రమం తప్పకుండా పెయింటింగ్‌ వేయాలని సూచించారు. మరో ఐదేళ్లకైనా రేడియల్‌ క్రస్ట్‌ గేట్లు కొత్తవి ఏర్పాటు చేయాల్సిన అవసరముందన్నారు. కొత్త గేట్లు ఏర్పాటు చేయకపోతే తుంగభద్ర పరిస్థితి ఎదురయ్యే ప్రమాదం ఉందన్నారు. శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు నిర్వహణకు ప్రభుత్వం నిధులు కేటాయించాలని కోరారు. ఆనకట్ట నుంచి 60 మీటర్ల దూరంలో ప్లంజ్‌పూల్‌ ఉందని, దాని వల్ల శ్రీశైలం ఆనకట్టకు ప్రమాదం లేదన్నారు.

నిండు కుండలా శ్రీశైలం ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా వరదలతో శ్రీశైలం జలాశయానికి భారీగా నీరు చేరుతుంది. సుంకేసుల, జూరాల ప్రాజెక్టుల నుంచి లక్ష 71 వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తుంది. ఔట్ ఫ్లో 67,399 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుతం 878.40 అడుగులకు చేరింది. పూర్తిస్థాయి నీటి నిల్వ 215.8070 టీఎంసీలకు గాను ఇప్పుడు 179.8995 టీఎంసీలుగా ఉంది. కుడి, ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. జలాశయం గరిష్ట స్థాయికి చేరువలో ఉండటంతో నేడో, రేపో గేట్లు ఎత్తే అవకాశం కనిపిస్తుంది. మరోవైపు జలాశయం పదో నంబర్ గేటు వద్ద పెద్దఎత్తున వాటర్‌ లీకేజీ అవుతోంది. గత నెలలో అధికారులు ఈ గేటు వద్ద మరమ్మతులు చేసినప్పటికీ భారీగా నీరు లీకవుతోంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి


 rajesh pande