శ్రీశైలం జలాశయానికి భారీ వదర..కొనసాగుతున్న జలవిద్యుత్ ఉత్పత్తి
శ్రీశైలం , 6 జూలై (హి.స.) రాష్ట్రంలో వ‌ర్షాలు మొద‌ల‌య్యాయి. రాష్ట్రంలో కురుస్తున్న వ‌ర్షాల‌తో వాగులు, వంక‌ల్లోకి నీరు చేరుతుంది. ప‌లు జ‌లాశ‌యాల‌కు భారీగా వ‌ర‌ద నీరు చేరుతోంది. ఈ నేప‌థ్యంలోనే శ్రీశైలం జ‌ల‌శ‌యానికి సైతం భారీగా వ‌ర‌ద కొన‌సాగుతోంది. ఈ జ
. శ్రీశైలం జలాశయానికి వరద


శ్రీశైలం , 6 జూలై (హి.స.)

రాష్ట్రంలో వ‌ర్షాలు మొద‌ల‌య్యాయి. రాష్ట్రంలో కురుస్తున్న వ‌ర్షాల‌తో వాగులు, వంక‌ల్లోకి నీరు చేరుతుంది. ప‌లు జ‌లాశ‌యాల‌కు భారీగా వ‌ర‌ద నీరు చేరుతోంది. ఈ నేప‌థ్యంలోనే శ్రీశైలం జ‌ల‌శ‌యానికి సైతం భారీగా వ‌ర‌ద కొన‌సాగుతోంది. ఈ జ‌లాశ‌యంలో ఇన్ ఫ్లో 1,71,208 క్యూసెక్కులు ఉండ‌గా, ఔట్ ఫ్లో 67,399 క్యూసెక్కులు ఉంది. జ‌లాశయం పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 878.40 అడుగుల వ‌ర‌కు నీరు చేరింది. పూర్తి స్దాయి నీటి నిల్వ 215.7080 టీఎంసీలు కాగా ప్రస్తుతం 179.8995 టీఎంసీల నీరు చేరింది. దీంతో కుడి, ఎడమ జలవిద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి కొన‌సాగుతోంది. జూరాల నిండ‌టంతో అధికారులు నీటిని కింద‌కు వ‌దులుతున్నారు. ఈ నేప‌థ్యంలోనే శ్రీశైలం జ‌లాశయంలోకి వ‌ర‌ద ఉధ్రితి పెరిగిన‌ట్టు తెలుస్తోంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి


 rajesh pande