నేడు తొలి ఏకాదశి.. రాష్ట్ర ప్రజలకు విషెస్ చెప్పిన సీఎం చంద్రబాబు
అమరావతి, 6 జూలై (హి.స.)తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ‘X’ (ట్విట్టర్) వేదికగా ట్వీట్ చేశారు. ‘తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా తెలుగు
నేడు తొలి ఏకాదశి.. రాష్ట్ర ప్రజలకు విషెస్ చెప్పిన సీఎం చంద్రబాబు


అమరావతి, 6 జూలై (హి.స.)తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ‘X’ (ట్విట్టర్) వేదికగా ట్వీట్ చేశారు. ‘తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా తెలుగు ప్రజలందరికీ శుభాకాంక్షలు. తొలి పండుగగా భావించే ఈ తొలి ఏకాదశి సందర్భంగా.. విష్ణుమూర్తి అనుగ్రహంతో అందరికీ మంచి జరగాలని ప్రార్థిస్తున్నాను. సమృద్ధిగా వర్షాలు పడి, పాడి పంటలతో రాష్ట్రం శోభిల్లాలని కోరుకుంటున్నాను. అంటూ సీఎం చంద్రబాబు ట్వీట్ చేశారు. కాగా, తొలి ఏకాదశి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా వైష్ణవాలయాలు భక్తులతో కిక్కిరిపోయాయి. ఆదివారం సెలవు దినం కావడంతో అంతా ఉదయాన్నే పుణ్య స్నానాలు ఆచరించి తమ ఇష్ట దైవాలను దర్శించుకునేందుకు ఆలయాలకు క్యూ కట్టారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి


 rajesh pande