బాబూ జగ్జీవన్ రామ్ వర్థంతి.. నివాళులు అర్పించిన జగన్
అమరావతి, 6 జూలై (హి.స.)మాజీ ఉప ప్రధాని డాక్టర్ జగ్జీవన్ రామ్ (babu jagjivan ram) వర్ధంతి సందర్భంగా.. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) నివాళులు అర్పించారు. బాబూ జగ్జీవన్ రామ్ ను స్మరించుకుంటూ ఆయన ఎక్స్ వేదికగా ఒక పోస
బాబూ జగ్జీవన్ రామ్ వర్థంతి.. నివాళులు అర్పించిన జగన్


అమరావతి, 6 జూలై (హి.స.)మాజీ ఉప ప్రధాని డాక్టర్ జగ్జీవన్ రామ్ (babu jagjivan ram) వర్ధంతి సందర్భంగా.. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) నివాళులు అర్పించారు. బాబూ జగ్జీవన్ రామ్ ను స్మరించుకుంటూ ఆయన ఎక్స్ వేదికగా ఒక పోస్ట్ పెట్టారు.

అణగారిన వర్గాల అభివృద్ధి కోసం అలుపెరుగని కృషి చేసిన మ‌హ‌నీయుడు, మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబూ జ‌గ్జీవ‌న్ రామ్ గారు. స్వాతంత్ర్య స‌మ‌ర యోధుడిగా, సంఘసంస్కర్తగా రాజ‌కీయ నాయ‌కుడిగా దేశానికి ఆయన అందించిన సేవ‌లు చిర‌స్మర‌ణీయం. నేడు బాబూ జ‌గ్జీవ‌న్ రామ్ గారి వ‌ర్ధంతి సంద‌ర్భంగా నివాళులు. అని ఆ పోస్ట్ లో పేర్కొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి


 rajesh pande