ఆదిలాబాద్ 9 జూలై (హి.స.)ఆదిలాబాద్‌లోని ఐసెట్ ఆన్‌లైన్ పరీక్ష కేంద్రం. ఓ పెద్దాయన(62) లోనికి వచ్చారు. అభ్యర్థులంతా పరీక్ష నిర్వాహకుడేమోనని అప్రమత్తమయ్యారు. ఆయనేమో చేతిలో హాల్‌టికెట్‌తో తన సీటును వెతుక్కుని కంప్యూటర్ ముందు కూర్చున్నారు. చక్కగా పరీక్ష రాశారు. ఫలితాల్లో ఏకంగా 178వ ర్యాంకు తెచ్చుకున్నారు. ఆయన నేపథ్యం పరిశీలిస్తే... డాక్టర్ కావాల్సిన కుమారుడు, కష్టసుఖాల్లో కలిసి నడిచిన భార్య... నెలల వ్యవధిలోనే కన్నుమూశారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరైనా తీవ్ర కుంగుబాటుకు గురవుతారు. ఈయన మాత్రం యువకులతో పోటీపడ్డారు. ర్యాంకు సాధించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ