కేంద్ర మంత్రి బండి సంజయ్ ఔదార్యం..విద్యార్థుల‌కు సైకిళ్ల పంపిణీ.
కరీంనగర్, 9 జూలై (హి.స.) టెన్త్ క్లాస్ చదివే విద్యార్థులకు సైకిళ్లను పంపిణీ చేసే కార్యక్రమానికి కరీంనగర్ అంబేద్కర్ స్టేడియంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ బుధవారం శ్రీకారం చుట్టారు. మొత్తం 20వేల సైకిళ్లను స్వంత నిధుల‌తో కొనుగోలు చేసిన బండి వాటి
బండి సంజయ్


కరీంనగర్, 9 జూలై (హి.స.)

టెన్త్ క్లాస్ చదివే విద్యార్థులకు సైకిళ్లను పంపిణీ చేసే కార్యక్రమానికి కరీంనగర్ అంబేద్కర్ స్టేడియంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ బుధవారం శ్రీకారం చుట్టారు. మొత్తం 20వేల సైకిళ్లను స్వంత నిధుల‌తో కొనుగోలు చేసిన బండి వాటిని దశల వారీగా పంపణీ చేసే కార్యక్రమాన్ని నేడు చేప‌ట్టారు. తొలుత కరీంనగర్ టౌన్ లోని ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి చదువుతున్న విద్యార్థులందరికీ సైకిళ్ల ను పంపిణీ చేశారు.ఈ కార్యక్రమానికి బండి సంజయ్ తో పాటు టీచర్ ఎమ్మెల్సీ మల్క కొమరయ్య, జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, నగర పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం, అదనపు కలెక్టర్ అశ్వినీ, మున్సిపల్ కమిషనర్ ప్రపుల్ దేశాయ్, మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ, బీజీపీ కరీంనగర్, సిరిసిల్ల జిల్లాల అధ్యక్షులు గంగాడి క్రిష్ణారెడ్డి, రెడ్డబోయిన గోపి, ఆర్డీవో, డీఈవోతో పాటు పలువురు అధికారులు హాజరయ్యారు.ఈ సంద‌ర్భంగా బండి మాట్లాడుతూ… ఈ సైకిళ్ల పంపిణీ ఆలోచన ఇచ్చిందే జిల్లా కలెక్టర్ అని అన్నారు. బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమంలో బాలికలకు సైకిళ్లు ఇస్తే బాగుంటుందని కలెక్టర్ ప్రతిపాదించార‌ని చెప్పారు.

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande