హైదరాబాద్, 9 జూలై (హి.స.)
తెలంగాణకు యూరియా సరఫరాపై
కేంద్రమంత్రి జేపీ నడ్డా కీలక ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణ రైతుల అవసరాలకు అనుగుణంగా యూరియా సరఫరా చేయాలని చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లో యూరియా దారిమళ్లదొని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి మేరకు యూరియా సరఫరాపై అధికారులకు నడ్డా ఆదేశాలు జారీ చేశారు.
కాగా, ఇటీవల రెండ్రోజుల పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో పర్యటించారు. వరుసగా కేంద్రమంత్రులతో భేటీ అయ్యారు. రాష్ట్రానికి యూరియా కోటా పెంచాలని ఎరువులు, రసాయనాల శాఖ మంత్రి జేపీ నడ్డాకు విజ్ఞప్తి చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్