హైదరాబాద్, 9 జూలై (హి.స.)
ఆధునికత అభ్యుదయానికి కేంద్రంగా తెలంగాణ రాష్ట్రం రోజురోజుకు శర వేగంగా అభివృద్ధి చెందుతుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. హైదరాబాద్ సోమాజిగూడ లోని కాన్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (CII ) ఆధ్వర్యంలో నేడు నిర్వహించిన చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్స్ సదస్సు లో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ, . ఔటర్ రింగ్ రోడ్డు ఫలితాలను మనం చూసామని అంటూ సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం రీజినల్ రింగ్ రోడ్డును ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుందని వివరించారు. రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణంతో ఫార్మా, ఐటీ కంపెనీలతోపాటు హౌసింగ్, అగ్రికల్చర్, హ్యాండ్లూమ్స్ వంటి అనేక రకాల పారిశ్రామిక క్లస్టర్ల నిర్మాణం జరుగుతుందని వివరించారు. హైదరాబాద్ కు ప్రపంచం నలుమూలల నుంచి పెట్టుబడులు తరలివస్తున్నాయని తెలిపారు. లండన్ లోనీ థేమ్స్ నది మాదిరిగా హైదరాబాద్ నగరంలో మూసి నదిని పారించేందుకు మూసి పునర్జీవనం ప్రాజెక్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిందని తెలిపారు. పెట్టుబడులకు హైదరాబాద్ పట్టణం, తెలంగాణ రాష్ట్రం స్వర్గ ధామం లాంటిదని వివరించారు.
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్