చెరువులను ప‌రిశీలించిన హైడ్రా చీఫ్ రంగనాథ్
హైదరాబాద్, 9 జూలై (హి.స.) మాసబ్ చెరువు దిలావర్ఖాన్ చెరువు, పెద్ద అంబర్పేట చెరువులను అనుసంధానం చేసే నాలాను ఒక మోడల్ గా తీర్చిదిద్దుతామని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ చెప్పారు. మొత్తం 7.50 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న నాలా పొడుగున అభివృద్ధి చెం
హైడ్రా రంగనాథ్


హైదరాబాద్, 9 జూలై (హి.స.)

మాసబ్ చెరువు దిలావర్ఖాన్ చెరువు, పెద్ద అంబర్పేట చెరువులను అనుసంధానం చేసే నాలాను ఒక మోడల్ గా తీర్చిదిద్దుతామని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ చెప్పారు. మొత్తం 7.50 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న నాలా పొడుగున అభివృద్ధి చెందాల్సిన పరిస్థితుల్లో.. ఇప్పుడు తగిన వెడల్పుతో నాలాను నిర్మిస్తే భవిష్యత్తులో ఇబ్బందులు ఉండవని వారు అన్నారు. రెవెన్యూ, జిహెచ్ఎంసి, ఇరిగేషన్ యిలా సంబంధిత శాఖలన్నిటితో సమావేశాన్ని ఏర్పాటు చేసి కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తామని అన్నారు. మాసబ్ చెరువు – దిలావర్ఖాన్ చెరువుల మధ్య నాలా సరిగా లేక అనేక కాలనీలు నీట మునుగుతున్నాయనే పిర్యాదుల నేపథ్యంలో ఇబ్రహీంపట్నం ఎంఎల్ఏ మల్ రెడ్డి రంగారెడ్డి తో కలసి బుధవారం కమిషనర్ పరిశీలించారు. మాసబ్ చెరువు – దిలావర్ఖాన్ చెరువుల మధ్య జాలికుంట పరిసరాల్లో కట్టిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను వారు చూసారు.

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్


 rajesh pande