భాజపా.రాష్ట్ర అధ్యక్షుడిగా పీ వీ ఎస్ మాధవ్ బాధ్యతలు చేపట్టారు
అమరావతి, 9 జూలై (హి.స.) విజయవాడ: భాజపా రాష్ట్ర అధ్యక్షుడిగా పీవీఎన్‌ మాధవ్‌ బుధవారం బాధ్యతలు చేపట్టారు. విజయవాడలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన బాధ్యతలు స్వీకరించారు. ముందుగా తుమ్మలపల్లి కళాక్షేత్రం నుంచి భాజపా కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు.
భాజపా.రాష్ట్ర అధ్యక్షుడిగా పీ వీ ఎస్ మాధవ్ బాధ్యతలు చేపట్టారు


అమరావతి, 9 జూలై (హి.స.)

విజయవాడ: భాజపా రాష్ట్ర అధ్యక్షుడిగా పీవీఎన్‌ మాధవ్‌ బుధవారం బాధ్యతలు చేపట్టారు. విజయవాడలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన బాధ్యతలు స్వీకరించారు. ముందుగా తుమ్మలపల్లి కళాక్షేత్రం నుంచి భాజపా కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. లెనిన్‌సెంటర్‌లో విశ్వనాథ సత్యనారాయణ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. లెనిన్‌సెంటర్‌ పేరు మార్చి విశ్వనాథ సత్యనారాయణ పేరు పెట్టాలని ఈ సందర్భంగా మాధవ్‌ డిమాండ్‌ చేశారు. భారత దేశానికి ఎలాంటి సంబంధం లేనప్పుడు లెనిన్‌ పేరు పెట్టాల్సిన అవసరమేంటని ప్రశ్నించారు. నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన మాధవ్‌కు పార్టీ సీనియర్‌ నేతలు దగ్గుబాటి పురందేశ్వరి, సోము వీర్రాజు, సత్యకుమార్‌, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తదితరులు అభినందనలు తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande