హైదరాబాద్, 9 జూలై (హి.స.)
గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అమర్నాథ్ యాత్రలో ప్రత్యక్షమయ్యారు. ఇటీవల ప్రారంభమైన అమర్నాథ్ యాత్రకు... రాజాసింగ్ కుటుంబ సమేతంగా వెళ్లినట్లు తెలుస్తోంది. అయితే అక్కడికి వెళ్లినప్పటికీ కూడా రాజాసింగ్.. ఓ వీడియో ద్వారా ప్రజలకు సందేశాన్ని పంపారు. అమర్నాథ్ యాత్రలో హిందువులందరూ పాల్గొనాలని అందులో వారు పిలుపునిచ్చారు. కేంద్రంలో మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమర్నాథ్ యాత్ర చాలా సులభం అయిందని ఈ సందర్భంగా రాజాసింగ్ పేర్కొన్నారు . యాత్ర మార్గంలో రోడ్డు సహా అన్ని మార్గాలు సమకూరాలని వెల్లడించారు. అమర్నాథ్ యాత్ర కు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పరిస్థితులు ఇక్కడ ఉన్నాయని స్పష్టం చేశారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత ముస్లింలకు ఉపాధి దొరికిందని ఈ సందర్భంగా పేర్కొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్