తెలంగాణ, 9 జూలై (హి.స.)
ములుగు జిల్లా వాజేడు మండలంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క 54వ పుట్టినరోజు వేడుకలు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఎస్సీ హాస్టల్ లోని విద్యార్థులకు పండ్లు పంపిణీ చేశారు. ఈసందర్భంగా కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు మాట్లాడుతూ.. ములుగు జిల్లాను అభివృద్ధి పథంలో నడిపిస్తున్న మంత్రి సీతక్క నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తమ సేవలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని తెలిపారు. ఈ వేడుకల్లో కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని మంత్రి సీతక్క కు శుభాకాంక్షలు తెలియజేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు