హైదరాబాద్, 9 జూలై (హి.స.)
కల్తీ కల్లు ఘటన జరిగిన కూకట్‌పల్లి పరిధి హైదర్‌నగర్ కల్లు కంపౌండ్ నిర్వాహకులను అరెస్టు చేసినట్లు రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. కల్తీ కల్లు తాగి గాంధీ, నిమ్స్ ఆస్పత్రులలోచికిత్స పొందుతున్న బాధితులను ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. కల్తీ కల్లు తాగి మొత్తం 19 మంది అస్వస్థతకు గురయ్యారని పేర్కొన్నారు.నిమ్స్ ఆస్పత్రిలో 15 మంది, గాంధీ ఆసుపత్రిలో ఇద్దరు, ప్రైవేటు ఆస్పత్రిలో మరో ఇద్దరు చికిత్స పొందుతున్నారని తెలిపారు. కల్తీ కల్లు ఘటనపై ప్రభుత్వం వెంటనే స్పందించని తెలిపారు. ఘటనకు కారణమైన కల్లు కాంపౌండ్‌లను సీజ్ చేశామని, నిర్వహకులను అరెస్ట్ చేశామని పేర్కొన్నారు. అదేవిధంగా కల్లు శ్యాంపిళ్లను కెమికల్ టెస్ట్ ల్యాబ్‌కు పంపించామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్