హైదరాబాద్, 9 జూలై (హి.స.)
ప్రజల సౌకర్యార్థం రవాణా శాఖలో అనేక సంస్కరణలు తీసుకొస్తున్నామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. బుధవారం నాడు రాజా బహదూర్ వెంకటరామ రెడ్డి తెలంగాణ పోలీస్ అకాడమీలో శిక్షణ పూర్తి చేసిన 96 మంది అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్లల పాసింగ్ ఔట్ పరేడ్ కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ ప్రజలకు సౌకర్యాలు కల్పిస్తున్నామని, ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ తీసుకొచ్చి వెహికిల్ ఫిట్నెస్ చేస్తున్నామని చెప్పారు. మీరంతా రవాణా శాఖలోకి రావడం వల్ల ఈ డిపార్ట్ మెంట్ మరింత పటిష్టం అయిందన్నారు. ఈ సందర్భంగా ఏవీఎంఐల గౌరవ వందనం స్వీకరించి శిక్షణలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వారికి అవార్డులు ప్రదానం చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్