సొంతిల్లు అనేది ప్రతి పేద వాడి స్వప్నం.. మంత్రి వాకిటి శ్రీహరి
తెలంగాణ, నారాయణపేట. 9 జూలై (హి.స.) గత 10 ఏండ్ల బీఆర్ఎస్ పరిపాలనలో ఊట్కూర్ మండలం లో ఒక్క డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇచ్చిన తాను రాజకీయసన్యాసం తీసుకుంటానని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. నారాయణపేట జిల్లాలోని ఊట్కూరు మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిద
మంత్రి శ్రీహరి


తెలంగాణ, నారాయణపేట. 9 జూలై (హి.స.)

గత 10 ఏండ్ల బీఆర్ఎస్ పరిపాలనలో ఊట్కూర్ మండలం లో ఒక్క డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇచ్చిన తాను రాజకీయసన్యాసం తీసుకుంటానని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. నారాయణపేట జిల్లాలోని ఊట్కూరు మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ప్రొసిడింగ్ పంపిణీ కార్యక్రమానికి బుుధవార మంత్రి శ్రీహరి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. అల్లుడు కూతురు వస్తే ఏడ పడుకుంటారని.. పేదవారికి ఇండ్లు ఇస్తానని ఆశ చూపి గత ప్రభుత్వం ఊట్కూర్ మండలం లో ఒక్క డబుల్ బెడ్ రూం కూడా ఇవ్వలేదన్నారు.

ఒకవేళ ఇచ్చినట్టు నిరూపిస్తే..

తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని అన్నారు. సొంతిల్లు అనేది ప్రతి పేదవాడి స్వప్నం అని.. అందుకే కాంగ్రెస్ ప్రభుత్వం ఆ దిశగా కృషి చేస్తుందన్నారు.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande