బీఆర్ఎస్ నేతలపై మంత్రి వివేక్ వెంకటస్వామి కీలక వ్యాఖ్యలు
హైదరాబాద్, 9 జూలై (హి.స.) బీఆర్ఎస్ నేతలపై మంత్రి వివేక్ వెంకటస్వామి కీలక వ్యాఖ్యలు చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గత పదేండ్లు మంత్రులతో ప్రజలు మాట్లాడే అవకాశం లేకుండేదని అన్నారు. కానీ.. తమ సీఎం అలా కాదని.. పాశమైలారం ఘటన జరిగిన వెంటనే రేవం
మంత్రి వివేక్


హైదరాబాద్, 9 జూలై (హి.స.)

బీఆర్ఎస్ నేతలపై మంత్రి వివేక్ వెంకటస్వామి కీలక వ్యాఖ్యలు చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గత పదేండ్లు మంత్రులతో ప్రజలు మాట్లాడే అవకాశం లేకుండేదని అన్నారు. కానీ.. తమ సీఎం అలా కాదని.. పాశమైలారం ఘటన జరిగిన వెంటనే రేవంత్ రెడ్డి అక్కడకు వెళ్లారని అన్నారు. బాధితులను పరామర్శించారు. వారిలో ధైర్యం నింపారని తెలిపారు. గతంలో కొండగట్టు అంత పెద్ద ఘటన జరిగినా కూడా.. కేసీఆర్ అక్కడికి వెళ్లిన పాపాన పోలేదని విమర్శించారు. పాశమైలారం ఘటన వద్దకు సీఎం వెళ్లినా కూడా కేటీఆర్ వెళ్ళలేదు అనే ప్రచారం చేశారని మండిపడ్డారు. బీఆర్ఎస్ హయాంలో పోలీసుల పహారా ఉంటుండే.. కానీ.. కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజలు దర్జాగా మంత్రులను కలుస్తున్నారని అన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande