న్యూఢిల్లీ, 9 జూలై (హి.స.)
ఇటీవల రాష్ట్రంలోని 26 మెడికల్ కాలేజీల్లో మౌలిక వసతులు సరిగా లేవని జాతీయ వైద్య మండలి నోటీసులు జారీ చేసింది. అయితే.. 2025-26 విద్యా సంవత్సరానికి గాను అన్ని మెడికల్ కాలేజీలకు ఎన్ఎంసీ పర్మిషన్‌ను రెన్యువల్ చేసింది. గతేడాది ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో లోపాలు గుర్తించిన ఎన్ఎంసీ జరిమానాలు విధించగా.. ఈ ఏడాది ఎలాంటి జరిమానాలు లేకుండానే అనుమతులను పునరుద్ధరించింది. గత నెల 18వ తేదీన ఢిల్లీలోని ఎన్ఎంసీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో వైద్యారోగ్య శాఖ కార్యదర్శి, డీఎంఈలు రాష్ట్రంలోని వైద్య కళాశాలలో నెలకొన్న సమస్యలను నాలుగు నెలల్లో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. దీంతో నాలుగు నెలల్లో ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో మౌలిక వసతులు కల్పించాలని ఆదేశిస్తూ ఎన్ఎంసీ వైద్య కళాశాలల అనుమతులను పునరుద్ధరించింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్