హైదరాబాద్, 9 జూలై (హి.స.):
ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో
కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ మేరకు A1గా ఉన్న ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ల్యాప్టాప్, మొబైల్ ఫోన్ను సిట్ అధికారులు సీజ్ చేశారు. ప్రస్తుతం వాటిలో ఉన్న డేటా అత్యంత కీలకంగా కానుందని తెలుస్తోంది. ల్యాప్టాప్, మొబైల్ నుంచి డేటా రిట్రైవ్ చేసేందుకు వాటిని ఎఫ్ఎస్ఎల్ (FLS)కు పంపారు. 2023 అక్టోబర్ నుంచి 2024 మార్చి15 వరకు మొత్తం కాల్ డేటాతో సహా బ్యాకప్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు ఈ నెల 14న మరోసారి విచారణకు హాజరు కావాలని సిట్ అధికారులు ప్రభాకర్ రావుకు సమాచారం అందజేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..