తెలంగాణ, భూపాలపల్లి. 9 జూలై (హి.స.)
దేశ వ్యాప్తం సమ్మెలో భాగంగా సింగరేణి కార్మిక జేఏసీ పిలుపుమేరకు భూగర్భ గనులతో పాటు ఓపెన్ కాస్ట్ గనుల్లో కార్మికులు బుధవారం సమ్మె చేశారు. అత్యవసర సిబ్బంది మినహా మిగిలిన కార్మికులంతా సమ్మెలో పాల్గొన్నారు. దీంతో బొగ్గు గనులు వెలవెలబోయాయి. సింగరేణి బొగ్గు గనుల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. కేంద్ర ప్రభుత్వం కార్మికులపై ఆలంబిస్తున్న వ్యతిరేక విధానాలు, 44 కార్మిక చట్టాలు నాలుగు లేబర్ కోడ్ లు రద్దు చేయాలంటూ కార్మిక సంఘాలు డిమాండ్ చేశాయి. అలాగే ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుపరం చేయవద్దంటూ కోరాయి. కార్మికుల సమ్మెతో భూపాలపల్లి డివిజన్‌లోని కాకతీయ బొగ్గు గనుల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచి పోయింది. భూపాలపల్లి ఏరియాలో సుమారు ఆరు వేల మెట్రిక్ టన్నులు ఉత్పత్తి కి అంతరాయం వాటిల్లగా సింగరేణి సంస్థ కు సుమారు రూ. 3 కోట్ల మేర నష్టం జరిగినట్లు అంచనా.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు