అమరావతి, 9 జూలై (హి.స.)
చంద్రగిరి, చిట్టినగర్, అతివేగం ఓ కుటుంబంలో అంతులేని విషాదం మిగిల్చింది. పుణ్యక్షేత్రాల సందర్శన కోసం వచ్చిన కుటుంబంలో తల్లీకుమారుడు మృతిచెందగా మరో మహిళ అపస్మారక స్థితిలోకి చేరుకున్న ఘటన చంద్రగిరి పరిధిలో మంగళవారం సాయంత్రం చోటుచేసుకుంది. పోలీసుల సమాచారం మేరకు.. విజయవాడ కేఎల్‌రావునగర్‌లోని సిండికేట్ బ్యాంకు కాలనీకి చెందిన కోటేశ్వరరావు, భార్య పద్మావతి (38), కుమారుడు జశ్వంత్‌సాయి (21), అక్క హేమలతతో కలిసి సొంత కారులో తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం తిరువణ్ణామలైలోని అరుణాచలేశ్వర స్వామివారిని దర్శించుకుని విజయవాడకు వెళ్తుండగా చంద్రగిరి మండలం తొండవాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదానికి గురయ్యారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ