తెలంగాణ, సిద్దిపేట. 9 జూలై (హి.స.)
ప్రభుత్వ నిబంధనల మేరకే
ఇందిరమ్మ ఇండ్లు నిర్మించుకోవాలని సిద్దిపేట జిల్లా కలెక్టర్ హైమవతి సూచించారు. సిద్దిపేట మున్సిపాలిటీ 37, 20 వార్డులలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను అడిషనల్ కలెక్టర్ గరిమా అగ్రవాల్ తో కలిసి బుధవారం కలెక్టర్ పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... బేస్మెంట్ పూర్తి ఐన తర్వాత 1 లక్షా, బేస్మెంట్ వరకు పిల్లర్స్ పూర్తి చేసిన తర్వాత 1 లక్షా, శ్లాబ్ పూర్తయిన తర్వాత రెండు లక్షలు, ఇల్లు మొత్తం లక్ష రూపాయలు మొత్తం ఐదు లక్షలు అందించడం జరుగుతుందన్నారు. 400 నుంచి 600 స్క్వేర్ ఫీట్స్ వరకు మాత్రమే ఇల్లు కట్టుకోవాలన్నారు. ఎక్కువ కట్టుకున్న తక్కువ కట్టుకున్న డబ్బులు రావని తెలిపారు. 400 స్క్వేర్ ఫీట్స్ వరకు చాలామందికి స్థలాలు లేవని లబ్ధిదారుల విజ్ఞప్తి మేరకు ప్రభుత్వానికి సమస్యను వివరిస్తానని జిల్లా కలెక్టర్ తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు