కృష్ణా జలాలపై తెలంగాణ ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రజంటేషన్
హైదరాబాద్, 9 జూలై (హి.స.) హైదరాబాద్లోని ప్రజా భవన్లో కృష్ణా నది జలాలపై ఆంధ్రప్రదేశ్ ద్వారా జరిగిన అక్రమ జల వినియోగంపై తెలంగాణ ప్రభుత్వం నేడు పవర్పాయింట్ ప్రజంటేషన్ నిర్వహిస్తోంది. అలాగే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తుమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు బ్యార
తెలంగాణ సర్కార్


హైదరాబాద్, 9 జూలై (హి.స.)

హైదరాబాద్లోని ప్రజా భవన్లో

కృష్ణా నది జలాలపై ఆంధ్రప్రదేశ్ ద్వారా జరిగిన అక్రమ జల వినియోగంపై తెలంగాణ ప్రభుత్వం నేడు పవర్పాయింట్ ప్రజంటేషన్ నిర్వహిస్తోంది. అలాగే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తుమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు బ్యారేజ్ మార్పిడిపై కూడా ఈ ప్రజంటేషన్లో వివరించనున్నారు. ఈ ప్రజంటేషన్ లో రాష్ట్ర ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు బి. మహేష్ కుమార్ గౌడ్, నీటిపారుదల రంగ నిపుణులు, రాష్ట్ర శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు, కార్పొరేషన్ చైర్పర్సన్లు హాజరయ్యారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్


 rajesh pande