అమరావతి, 9 జూలై (హి.స.)
బంగారుపాళ్యం: వైకాపా అధినేత వైఎస్ జగన్ () చిత్తూరు జిల్లా బంగారుపాళ్యంo పర్యటనను వైకాపా నేతలు ఎప్పటిలా బలప్రదర్శనకు వేదికగా మార్చారు. బుధవారం ఉదయం బెంగళూరు నుంచి అరగొండ ఫ్లైఓవర్ వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్దకు జగన్ చేరుకున్నారు. అక్కడ 30 మందికి అనుమతి ఉండగా వందలాది మంది దూసుకురావడంతో తోపులాట జరిగింది. రోడ్ షో, ర్యాలీకి అనుమతి లేనప్పటికీ.. హెలిప్యాడ్ నుంచి మార్కెట్ యార్డు వరకు పెద్ద సంఖ్యలో వాహనాలతో రోడ్ షో నిర్వహించారు. ఆంక్షలు ఉల్లంఘించి కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. దీంతో పోలీసులు స్వల్ప లాఠీఛార్జ్ చేశారు. ఈ క్రమంలో కాన్వాయ్ నుంచి వైకాపా నేత విజయానంద రెడ్డి జారిపడ్డారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ