రామాలయం ఈఓపై జరిగిన దాడిని ఖండించిన రాజన్న ఆలయ ఉద్యోగులు
తెలంగాణ, వేములవాడ. 9 జూలై (హి.స.) భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయ కార్యనిర్వహణ అధికారి రమాదేవి పై జరిగిన దాడిని వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయ ఉద్యోగులు, సిబ్బంది తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు ఆలయ ఉద్యోగ సంఘం ఆధ్వర్యంలో ఆలయ ప్రా
రాజన్న ఆలయం


తెలంగాణ, వేములవాడ. 9 జూలై (హి.స.)

భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయ కార్యనిర్వహణ అధికారి రమాదేవి పై జరిగిన దాడిని వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయ ఉద్యోగులు, సిబ్బంది తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు ఆలయ ఉద్యోగ సంఘం ఆధ్వర్యంలో ఆలయ ప్రాంగణంలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలువురు ఉద్యోగ సంఘం నాయకులు మాట్లాడుతూ రామాలయానికి సంబంధించిన భూములను కబ్జాదారుల చెర నుండి రక్షించే క్రమంలో వెళ్లిన దేవాదాయ, ధర్మాదాయ శాఖ అధికారులు, సిబ్బందిపై గ్రామస్తులు ఇలా దాడులు చేయడం తీవ్ర ఆవేదన కలిగిస్తోందనీ, ఆలయ భూములను పరిరక్షించేందుకు కృషి చేస్తున్న అధికారులకు ఇదొక నిరుత్సాహకర పరిణామమని అన్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆలయ భూములను పరిరక్షించే కార్యాచరణలో ఉన్న ఉద్యోగులకు ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande