ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలి : కలెక్టర్ ప్రతీక్‌ జైన్‌
తెలంగాణ, వికారాబాద్. 9 జూలై (హి.స.) వన మహోత్సవంలో భాగంగా ప్రతి పౌరుడు మొక్క నాటి సంరక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉందని వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్‌ జైన్ పేర్కొన్నారు. బుధవారం వికారాబాద్ జిల్లా నవపేట మండలం చింతలపేట గ్రామంలో జిల్లా పరిషత్ పాఠశాల
కలెక్టర్ ప్రతీక్‌ జైన్‌


తెలంగాణ, వికారాబాద్. 9 జూలై (హి.స.)

వన మహోత్సవంలో భాగంగా ప్రతి పౌరుడు మొక్క నాటి సంరక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉందని వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్‌ జైన్ పేర్కొన్నారు. బుధవారం వికారాబాద్ జిల్లా నవపేట మండలం చింతలపేట గ్రామంలో జిల్లా పరిషత్ పాఠశాల యందు చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య తో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. భవిష్యత్ తరాలకు మంచి వాతావరణాన్ని అందించడం కోసం మొక్కలు తప్పనిసరి అన్నారు. చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య మాట్లాడుతూ.. ప్రతి పౌరుడు బాధ్యతగా మొక్కలు నాటినప్పుడే అవి భవిష్యత్తు తరాలకు మంచి ఆక్సిజన్ ను అందిస్తాయని పేర్కొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande