తిరుమల , 9 జూలై (హి.స.)కలియుగ వైకుంఠ దైవం అయిన తిరుమల తిరుపతి దేవస్థానం (Tirumala Tirupati Temple)లో గత రెండు వారాలుగా భక్తుల రద్దీ (crowd of devotees) కొనసాగుతూనే ఉంది. ఈ నెల 6న ఏకాదశి ఉండటంతో భక్తులు తిరుమలకు పెద్ద ఎత్తున చేరుకొని శ్రీవారి దర్శనం (Srivari Darshan) చేసుకున్నారు. ఈ క్రమంలో మొదలైన రద్ధీ మంగళవారం వరకు కొనసాగింది. అయితే టీటీడీ అధికారులు తీసుకుంటున్న ముందస్తు చర్యల కారణంగా.. భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా వీలైనంత త్వరగా శ్రీవారి సర్వదర్శనం పూర్తయ్యేలా చూస్తున్నారు.
దీంతో మంగళవారం ఒక్కరోజు శ్రీవారిని 78, 320 మంది భక్తులు దర్శించుకున్నారు. వారిలో 24,950 మంది తలనీలాలు సమర్పించుకోగా.. రూ. 4.66 కోట్ల హుండీ ఆదాయం వచ్చింది. ఇదిలా ఉంటే బుధవారం తెల్లవారు జామున స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. దీంతో 21 కంపార్టుమెంట్ల (21 compartments)లో దర్శనం కోసం భక్తులు వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. అయితే గత వారం రోజుల తో పోలిస్తే.. ఈ రోజు భక్తుల రద్ధీ కాస్త తగ్గిందని టీటీడీ అధికారులు తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి