కూలిన వంతెన.. నదిలో పడిన వాహనాలు
వడోదర, 9 జూలై (హి.స.)వంతెన కుప్పకూలడంతో వాహనాలు నదిలో పడిపోయిన ఘటన గుజరాత్‌లోని వడోదరలో చోటుచేసుకుంది. బుధవారం ఉదయం పద్రా వద్ద మహిసాగర్ నదిపై ఉన్న గంభీర వంతెనలోని కొంతభాగం ఒక్కసారిగా కుప్పకూలింది. దీంతో దానిపై వెళ్తున్న రెండు ట్రక్కులు, రెండు వ్యాన్ల
కూలిన వంతెన.. నదిలో పడిన వాహనాలు


వడోదర, 9 జూలై (హి.స.)వంతెన కుప్పకూలడంతో వాహనాలు నదిలో పడిపోయిన ఘటన గుజరాత్‌లోని వడోదరలో చోటుచేసుకుంది. బుధవారం ఉదయం పద్రా వద్ద మహిసాగర్ నదిపై ఉన్న గంభీర వంతెనలోని కొంతభాగం ఒక్కసారిగా కుప్పకూలింది. దీంతో దానిపై వెళ్తున్న రెండు ట్రక్కులు, రెండు వ్యాన్లు సహా పలు వాహనాలు నదిలో పడిపోవడంతో తొమ్మిదిమంది ప్రాణాలు కోల్పోయారు. ఘటనా స్థలానికి చేరుకున్న సహాయక బృందాలు వాహనాల నుంచి ఇప్పటివరకు నలుగురిని రక్షించారని.. ఆపరేషన్ ఇంకా కొనసాగుతోందని అధికారులు పేర్కొన్నారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందన్నారు. 1985లో నిర్మించిన ఈ వంతెన పాతబడడంతో పాటు.. కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల కూలిపోయి ఉండొచ్చని అధికారులు అభిప్రాయం వ్యక్తంచేశారు. గుజరాత్‌లోని వడోదర-ఆనంద్‌ పట్టణాలను కలుపుతున్న ఈ వంతెన కూలడంతో ఇరు పట్టణాల మధ్య రాకపోకలు నిలిచిపోయినట్లు పేర్కొన్నారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande