బీజేపీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు చేపట్టనున్న మాధవ్
అమరావతి, 9 జూలై (హి.స.)ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా నియమితులైన పి.వి.ఎన్. మాధవ్(BJP Chief PVN Madhav) ఈ రోజు బాధ్యతలు స్వీకరించనున్నారు. అమరావతిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఉదయం అధికారికంగా అధ్యక్ష బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ సంద
బీజేపీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు చేపట్టనున్న మాధవ్


అమరావతి, 9 జూలై (హి.స.)ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా నియమితులైన పి.వి.ఎన్. మాధవ్(BJP Chief PVN Madhav) ఈ రోజు బాధ్యతలు స్వీకరించనున్నారు.

అమరావతిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఉదయం అధికారికంగా అధ్యక్ష బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ సందర్భంగా ఉదయం అమరావతిలోని తుమ్మలపల్లి కళాక్షేత్రం నుంచి బీజేపీ రాష్ట్ర కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. ఈ ర్యాలీలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొననున్నారు. పి.వి.ఎన్. మాధవ్ గతంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా, ఇతర కీలక పదవులలో పనిచేశారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి బీజేపీ నాయకులు, కార్యకర్తలు హాజరవుతారని అంచనా.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి


 rajesh pande