సామాజిక పింఛను నగదు.తీసుకెళ్తున్న. సచివాలయ ఉద్యోగి నీ.గుర్తు తెలియని.వ్యక్తులు అడ్డగించి.సొమ్ము.దోపిడి
అమరావతి, 1 ఆగస్టు (హి.స.) ముంచంగిపుట్టు, ప్రభుత్వం అందించే సామాజిక పింఛన్ల నగదు తీసుకెళ్తున్న సచివాలయ ఉద్యోగిని గుర్తుతెలియని వ్యక్తులు అడ్డగించి సొమ్ము దోపిడీ చేశారు. ముంచంగిపుట్టు మండలం బంగారుమెట్ట పంచాయతీలోని రాయిపల్లి సమీపంలోని వంతెన వద్ద గురువ
సామాజిక పింఛను నగదు.తీసుకెళ్తున్న. సచివాలయ ఉద్యోగి నీ.గుర్తు తెలియని.వ్యక్తులు అడ్డగించి.సొమ్ము.దోపిడి


అమరావతి, 1 ఆగస్టు (హి.స.)

ముంచంగిపుట్టు, ప్రభుత్వం అందించే సామాజిక పింఛన్ల నగదు తీసుకెళ్తున్న సచివాలయ ఉద్యోగిని గుర్తుతెలియని వ్యక్తులు అడ్డగించి సొమ్ము దోపిడీ చేశారు. ముంచంగిపుట్టు మండలం బంగారుమెట్ట పంచాయతీలోని రాయిపల్లి సమీపంలోని వంతెన వద్ద గురువారం రాత్రి ఈ ఘటన జరిగింది. పెదబయలు ఎంపీడీఓ పూర్ణయ్య తెలిపిన వివరాల ప్రకారం.. పెదబయలు మండలం బొండాపల్లి పంచాయతీలో వెల్ఫేర్‌ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్న మత్స్యబాబు పింఛన్ల బట్వాడా నిమ్తితం గురువారం భారతీయ స్టేట్‌బ్యాంకులో రూ. 15.62 లక్షల నగదు తీసుకున్నారు. చెరువుపాకల గ్రామంలోని తన ఇంటికి వెళ్తుండగా రాయిపల్లి వద్ద గుర్తుతెలియని ఇద్దరు దుండగులు తుపాకులు, కత్తులు చూపి, నగదు లాక్కున్నారు. దుండగులు వారు వచ్చిన స్కూటీపైనే అక్కడి నుంచి పరారయ్యారు. మత్స్యబాబు సాహసించి ఆ మార్గంలో ద్విచక్రవాహనంపై వస్తున్న మరో వ్యక్తి సహాయంతో దుండగులను వెంబడించారు. పెదబయలు మీదుగా ఒడిశా వైపు వెళ్లినట్లు గుర్తించారు. ఒడిశాలోని బయలుగుడ సమీపంలో.. దుండగుల స్కూటీ పొలాల్లోకి దూసుకుపోయింది. దుండగులు వాహనాన్ని పొలాల్లో వదిలేసి పారిపోయారు. ఈ స్కూటీని మత్స్యబాబు ముంచంగిపుట్టు పోలీసులకు అప్పగించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసిన ఎస్సై రామకృష్ణ ఆధ్వర్యంలో స్కూటీని తనిఖీ చేయగా.. రూ.5 లక్షల నగదు దొరికిందని పేర్కొన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారని ఎంపీడీఓ పూర్ణయ్య చెప్పారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande