అమరావతి, 1 ఆగస్టు (హి.స.)
, :పాఠశాలలకు టీచర్ల కేటాయింపుపై మే నెలలో జారీచేసిన జీవో 21కు కొన్ని సవరణలు చేస్తూ పాఠశాల విద్యాశాఖ గురువారం ఉత్తర్వులు జారీచేసింది. ప్రాథమిక పాఠశాలల్లోని ఫౌండేషనల్ స్కూల్‌కు విద్యార్థులు, టీచర్ల నిష్పత్తిని మార్చింది. పాత జీవో ప్రకారం 1 నుంచి 30 మంది విద్యార్థులకు ఒక టీచర్‌ను కేటాయించగా, ఇప్పుడు 20 మంది విద్యార్థులకు ఒక టీచర్‌గా సవరణ చేసింది. 60 మంది విద్యార్థులకు రెండో టీచర్‌ను ఇస్తారని తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా అదనంగా 1901 మంది టీచర్లు అవసరమవుతారని తెలిపింది
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ