నేడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కడపలో పర్యటించనున్నారు
అమరావతి, 1 ఆగస్టు (హి.స.) ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇవాళ కడప జిల్లాలో పర్యటించనున్నారు.. పెన్షన్ల పంపిణీలో పాల్గొననున్న సీఎం.. పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొని దిశానిర్దేశం చేయనున్నారు.. ఇక, పలు అభివృద్ధి కార్యక్రమాల్లోని పాల్గొని తిరుగు
నేడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కడపలో పర్యటించనున్నారు


అమరావతి, 1 ఆగస్టు (హి.స.)

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇవాళ కడప జిల్లాలో పర్యటించనున్నారు.. పెన్షన్ల పంపిణీలో పాల్గొననున్న సీఎం.. పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొని దిశానిర్దేశం చేయనున్నారు.. ఇక, పలు అభివృద్ధి కార్యక్రమాల్లోని పాల్గొని తిరుగు ప్రయాణం కానున్నారు సీఎం నారా చంద్రబాబు నాయుడు..

ఉదయం 11.45 గంటలకు గన్నవరం ఎయిర్ పోర్టు నుండి కడప ఎయిర్ పోర్ట్ కు చేరుకోనున్న సీఎం చంద్రబాబు.. అక్కడ నుండి హెలికాప్టర్ లో జమ్మలమడుగు చేరుకుంటారు.. మధ్యాహ్నం 12.25 గంటలకు గూడెం చెరువు గ్రామంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు.. మధ్యాహ్నం 12.50 నుండి 2 గంటల వరకు గూడెం చెరువులో ఏర్పాటు చేసిన ప్రజావేదిక సభలో పాల్గొని మాట్లాడతారు.. అనంతరం జమ్మలమడుగులో పార్టీ కార్యకర్తల సమావేశానికి హాజరుకానున్నారు టీడీపీ అధినేత.. ఇక, సాయంత్రం 4 గంటలకు గండికోటకు చేరుకోనున్న సీఎం చంద్రబాబు.. గండికోట వ్యూ పాయింట్ సందర్శన.. గండికోట వ్యూ పాయింట్ వద్ద 78 కోట్లతో సాస్కీ పథకం కింద గండికోట ప్రాజెక్ట్ కు శంకుస్థాపన చేస్తారు.. అనంతరం అక్కడ వివిధ ప్రాజెక్టుల్లో భాగస్వాములైన ప్రతినిధులతో సీఎం సమావేశం కానున్నారు.. సాయంత్రం 6 గంటలకు కడప ఎయిర్ పోర్టు నుండి విజయవాడకు తిరుగు ప్రయాణం కానున్నారు సీఎం నారా చంద్రబాబు నాయుడు..

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande