భిక్కనూరు రైల్వే స్టేషన్ లో ఎక్స్ ప్రెస్ రైళ్లు ఆపే విధంగా కృషి చేస్తా.. బండి సంజయ్
న్యూఢిల్లీ, 1 ఆగస్టు (హి.స.) దక్షిణ కాశీగా భాసిల్లుతున్న సిద్ధ రామేశ్వరాలయ అభివృద్ధి కోసం తన వంతు పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ భరోసానిచ్చాడు. కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండల కేంద్రానికి చెందిన కౌసల్య ఫౌండే
బండి సంజయ్


న్యూఢిల్లీ, 1 ఆగస్టు (హి.స.)

దక్షిణ కాశీగా భాసిల్లుతున్న సిద్ధ

రామేశ్వరాలయ అభివృద్ధి కోసం తన వంతు పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ భరోసానిచ్చాడు. కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండల కేంద్రానికి చెందిన కౌసల్య ఫౌండేషన్ యజమాని పెద్ద బచ్చ గారి జ్ఞాన ప్రకాష్ రెడ్డి శుక్రవారం నాడు ఢిల్లీలోని ఆయన నివాసంలో కలిసి సిద్ద రామేశ్వర స్వామి ఆలయ ప్రాముఖ్యతను ఆయనకు వివరించారు. అంతేకాకుండా భిక్కనూరు రైల్వే స్టేషన్ లో ఎక్స్ ప్రెస్ రైళ్లు ఆపే విధంగా చర్యలు తీసుకోవాలని, తద్వారా ఆలయానికి వచ్చే భక్తులకు సౌకర్యంగా ఉంటుందన్నారు. నాలుగు వందల సంవత్సరాల క్రితం వెలసిన స్వయంభు లింగ మహా క్షేత్రానికి ఎంతో చరిత్ర ఉందన్నారు. అటువంటి ప్రాశస్త్యం పొందిన ఆలయాన్ని సందర్శించేందుకు రావాలని మంత్రి బండి సంజయ్ కు ఆయన విజ్ఞప్తి చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande