రాజమహేంద్రవరం, 1 ఆగస్టు (హి.స.)
, :తండ్రి తీసుకొచ్చిన డ్రోన్‌ను సరదాగా గాల్లోకి ఎగరేసిన పదో తరగతి విద్యార్థి చిక్కుల్లో పడ్డాడు. ఆ డ్రోన్ రాజమండ్రి సెంట్రల్ జైలు ఆవరణపై ఎగరడంతో.. ఆ బాలుడిపై ఎఫ్‌ఐఆర్ నమోదైంది. రాజమండ్రి సెంట్రల్ జైలు వెనుక భాగంలోని నివాస భవనాల మీదుగా మంగళవారం రాత్రి సుమారు 8.30 గంటల సమయంలో సెంట్రల్ జైలు ఆవరణపైకి ఓ డ్రోన్ ఎగిరింది. వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డి ఇక్కడే రిమాండ్ ఖైదీగా ఉన్నారు. సీఎం చంద్రబాబును గతంలో ఇక్కడ రిమాండ్‌లో పెట్టినప్పుడు కూడా డ్రోన్‌ను ప్రయోగించడం వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ రాహుల్ డ్రోన్ వ్యవహారంపై వన్‌టౌన్ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదుచేశారు. రంగంలోకి దిగిన పోలీసులు విచారణలో విద్యార్థి డ్రోన్‌ను సరదాగా
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ