.హెచ్ సి ఏ అధ్యక్షుడు. జగన్ మోహన్ రావు.సస్పెండ్
,హైదరాబాద్‌ ఆగస్టు (హి.స.) క్రికెట్‌ అసోసియేషన్‌ అక్రమాల వ్యవహారంలో సీఐడీ దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగుచూసిన విషయం తెలిసిందే. తాజాగా హెచ్ సీఏలో భారీ కుదుపు చోటుచేసుకుంది. హెచ్ఎసీఏ అపెక్స్ కౌన్సిల్ కీలక నిర్ణయం తీసుకుంది. హెచ్ సీఏ అధ్యక్షుడు జగన్
.హెచ్ సి ఏ అధ్యక్షుడు. జగన్ మోహన్ రావు.సస్పెండ్


,హైదరాబాద్‌ ఆగస్టు (హి.స.)

క్రికెట్‌ అసోసియేషన్‌ అక్రమాల వ్యవహారంలో సీఐడీ దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగుచూసిన విషయం తెలిసిందే. తాజాగా హెచ్ సీఏలో భారీ కుదుపు చోటుచేసుకుంది. హెచ్ఎసీఏ అపెక్స్ కౌన్సిల్ కీలక నిర్ణయం తీసుకుంది. హెచ్ సీఏ అధ్యక్షుడు జగన్ మోహన్ రావును సస్పెండ్ చేసినట్లు తెలిపింది. కార్యదర్శి దేవరాజ్, ఖజాంచి శ్రీనివాస్ రావు పదవి నుంచి తొలగించినట్లు పేర్కొంది. 28 జూలై 2025న జరిగిన అత్యవసర సమావేశంలో ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నట్లు వివరించింది.

నిధుల దుర్వినియోగం, మోసం, అధికార బల దుర్వినియోగ ఆరోపణల నేపథ్యంలో సీఐడీ, ఈడీ సంస్థలు ఆరోపణలపై దర్యాప్తు చేపట్టినట్లు హెచ్ఎసీఏ వెల్లడించింది. హెచ్ఎసీఏ నియమ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకున్నట్లు తెలిపింది. పారదర్శకత, నైతిక విలువలకు కట్టుబడి ఉన్నామని హెచ్ఎసీఏ కౌన్సిల్ వెల్లడించింది. సంఘం న్యాయబద్ధతను కాపాడేందుకే చర్యలు తీసుకున్నామని హెచ్ఎసీఏ అపెక్స్ కౌన్సిల్ తెలిపింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande