సీఎం రేవంత్ ఫొటోతో హాజరు నమోదు.. పంచాయతీ కార్యదర్శిపై సస్పెన్షన్ వేటు
జగిత్యాల, 1 ఆగస్టు (హి.స.) ప్రభుత్వ ఉద్యోగులు విధులకు గైర్హాజరు కాకుండా ప్రభుత్వం ఫేషియల్ రికగ్నిషన్ సిస్టం అందుబాటులోకి తీసుకొచ్చిన విషయం విదితమే. దీంతో మొబైల్ యాప్ తో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగుల అటెండెన్స్ పక్రియ కొనసాగుతోంది. అయితే, విధులకు హాజర
జగిత్యాల కలెక్టర్


జగిత్యాల, 1 ఆగస్టు (హి.స.)

ప్రభుత్వ ఉద్యోగులు విధులకు గైర్హాజరు కాకుండా ప్రభుత్వం ఫేషియల్ రికగ్నిషన్ సిస్టం అందుబాటులోకి తీసుకొచ్చిన విషయం విదితమే. దీంతో మొబైల్ యాప్ తో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగుల అటెండెన్స్ పక్రియ కొనసాగుతోంది. అయితే, విధులకు హాజరైన పంచాయతీ కార్యదర్శి స్పాట్ నుంచి సెల్ఫీని తీసి యాప్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. కానీ, కొందరు ఫేషియల్ రికగ్నేషన్ యాప్లో ప్రతి రోజూ ఒకే ఫోటో పెడుతుండటంతో అనుమానం వచ్చిన అధికారులు విస్తృతంగా తనిఖీలు చేపట్టగా సంచలన అంశాలు వెలుగులోకి వచ్చాయి. చాలామంది పంచాయతీ కార్యదర్శులు విధులకు హాజరుకాకుండా తమ అసిస్టెంట్లకు తమ పాస్పోర్టు ఫొటోలతో పాటు మొబైల్ ఫోన్లను ఇచ్చి కార్యాలయాలకు హాజరైనట్లుగా ఫోటోలను అప్లోడ్ చేస్తున్నారు. తాజాగా, జగిత్యాల జిల్లాలో ఓ పంచాయతీ కార్యదర్శి ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి ఫోటోనే అప్లోడ్ చేసినట్లు గుర్తించారు. దీంతో బుగ్గారం మండల పరిధిలోని చందయాపల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శి రాజన్నను విధుల నుంచి సస్పెండ్ చేస్తున్నట్లుగా కలెక్టర్ సత్యప్రసాద్ ఇవాళ ఉత్తర్వులు జారీ చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande