హైదరాబాద్, 1 ఆగస్టు (హి.స.) కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ విచారణ నివేదికను జస్టిస్ పి.చంద్రఘోష్ కమిషన్ గురువారం ప్రభుత్వానికి సమర్పించింది. నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జాకు 650 పేజీలకు పైగా రిపోర్టును సీల్డ్ కవర్లో అందజేసింది. 2024 మార్చి 14న కమిషన్ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయగా.. కమిషన్ 15 నెలల పాటు మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణాలపై 119 మందిని విచారించి స్టేట్మెంట్లను రికార్డ్ చేసింది. ఈ నేపథ్యంలో కమిషన్ ఇచ్చిన నివేదిక ఇవాళ ఉదయం ముఖ్యమంత్రి కార్యాలయానికి చేరింది. దీంతో రిపోర్టుపై ఉన్నతాధికారులు అధ్యయనం చేయనున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్