విధుల పట్ల నిర్లక్ష్యం.. అంగన్వాడి టీచర్,సూపర్వైజర్ సస్పెన్షన్..
కరీంనగర్, 1 ఆగస్టు (హి.స.) విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన అంగన్వాడీ టీచర్, సూపర్వైజర్ ని సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. గంగాధర సీడీపీఓ నర్సింగారాణికి షోకాజ్ నోటీస్ ఇచ్చారు. జులై 30వ తేదీ బుధవారం జి
కరీంనగర్ కలెక్టర్


కరీంనగర్, 1 ఆగస్టు (హి.స.)

విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన

అంగన్వాడీ టీచర్, సూపర్వైజర్ ని సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. గంగాధర సీడీపీఓ నర్సింగారాణికి షోకాజ్ నోటీస్ ఇచ్చారు.

జులై 30వ తేదీ బుధవారం జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి చొప్పదండి మండలం రుక్మాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాల, అంగన్వాడీ కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా నిరుపయోగంగా ఉన్న అంగన్వాడీ కేంద్రం గదిలో ఆట వస్తువులు ఉంచి తాళం వేయడం, పిల్లలు ఉపయోగించే వాష్ రూములకు తాళం వేసి ఉండడం, పిల్లల హాజరు తక్కువగా నమోదవడం, విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడం వంటి కారణాల వల్ల రుక్మాపూర్ అంగన్వాడి కేంద్రంలో అంగన్వాడీ టీచర్ గా విధులు నిర్వహిస్తున్న వి.స్వరూప ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు వెలువరించారు. సెక్టార్ పరిధిలోని అంగన్వాడీ కేంద్రాల పర్యవేక్షణ బాధ్యతలు నిర్వహించాల్సిన సూపర్వైజర్ కే.శశికుమారిని విధుల పట్ల నిర్లక్ష్యం వహించడం, పర్యవేక్షణ లోపం కారణంగా సస్పెన్షన్ చేస్తూ ఉత్తర్వులు వెలువరించారు.

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande