న్యూఢిల్లీ: 1 ఆగస్టు (హి.స.)
జమ్మూకాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా గుజరాత్‌లో పర్యటించారు. పర్యటనలో భాగంగా సబర్మతి నదీ తీరం దగ్గర ఐక్యతా విగ్రహాన్ని సందర్శించారు. ఇందకు సంబంధించిన ఫొటోను ముఖ్యమంత్రి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీనికి ప్రధాని మోడీ స్పందించి ప్రశంసలు కురిపించారు.
పహల్గామ్ ఉగ్ర దాడి తర్వాత జమ్మూకాశ్మీ్ర్‌లో పర్యాటక రంగం దెబ్బతింది. దీంతో ముఖ్యమంత్రి ఒమర్ అబ్దు్ల్లా రాష్ట్రాల పర్యటన చేపట్టారు. పర్యాటక రంగాన్ని ప్రోత్సహించేందుకు పూనుకున్నారు. ఇందులో భాగంగా ఇటీవల గుజరాత్‌లో ఒమర్ అబ్దుల్లా రెండు రోజుల పర్యటన చేపట్టారు. జమ్మూకాశ్మీర్ పర్యాటక రంగం గురించి వివరించారు. భద్రత కల్పిస్తామంటూ హామీ ఇచ్చారు. జమ్మూ కాశ్మీర్ పర్యాటక రంగం ఆర్థిక వ్యవస్థకు కీలకమైన భాగం అని.. లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తుందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. తోటి భారతీయులు జమ్మూకాశ్మీర్‌ను సందర్శించాలని కోరుతున్నట్లు వేడుకున్నారు. పహల్గామ్‌లో జరిగిన ఘటనను మరిచిపోయి.. తిరిగి పర్యాటక రంగాన్ని ప్రోత్సహించాలని విజ్ఞప్తి చేస్తున్నట్లు పేర్కొన్నారు.
4
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు