బీఆర్ఎస్ కు నూకలు చెల్లాయి.. అందుకే కాంగ్రెస్ పై అవాకులు చెవాకులు: పీసీసీ చీఫ్
వికారాబాద్, 1 ఆగస్టు (హి.స.) ప్రజలను బీఆర్ఎస్ అడుగడుగునా మోసం చేసింది కాబట్టే ప్రజలు ఆ పార్టీని ఇంటికి పంపించారని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ విమర్శించారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారని, కానీ బీసీలకు రిజర్వేషన
పిసిసి చీఫ్


వికారాబాద్, 1 ఆగస్టు (హి.స.)

ప్రజలను బీఆర్ఎస్ అడుగడుగునా మోసం చేసింది కాబట్టే ప్రజలు ఆ పార్టీని ఇంటికి పంపించారని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ విమర్శించారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారని, కానీ బీసీలకు రిజర్వేషన్లు అనేది కాంగ్రెస్ పార్టీ కమిట్ మెంట్ అన్నారు. జనహిత పాదయాత్రలో భాగంగా ఇవాళ పరిగిలో ఓ న్యూస్ చానల్ తో మాట్లాడిన ఆయన.. గత ప్రభుత్వంలో బీసీల రిజర్వేషన్లను 33 శాతం నుంచి 22 శాతానికి తగ్గించిన వారు ఇవాళ బీసీల రిజర్వేషన్ల కోసం ఏదో చిసినట్లు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని కామారెడ్డి డిక్లరేషన్ లో హామీ ఇచ్చామని ఈ ఎజెండా బిల్లుకు మారిందన్నారు. ఈ దేశ చరిత్రలో ఏ రాష్ట్రం చేయని విధంగా కులగణన చేసిన చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వానిదన్నారు. తాము చేస్తున్న పనులతో ప్రజల్లో తమ పని అయిపోయిందని తెలుసుకున్న బీఆర్ఎస్ నేతలు అవాకులు చెవాలుకులు పేలుతున్నారన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande