హైదరాబాద్, 1 ఆగస్టు (హి.స.)
బీఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ
సీఎం కేసీఆర్ ఆ పార్టీ కీలక నేతలతో రెండో రోజు సమావేశమయ్యారు
ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో నిన్న కేటీఆర్, హరీశ్ రావు ఇతర నేతలతో భేటీ కాగా ఇవాళ కేటీఆర్, హరీశ్ రావు, జగదీశ్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి తదితర నేతలతో సమావేశం అయ్యారు. కాళేశ్వరం కమిషన్ చైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ ప్రభుత్వానికి నివేదిక అందజేయడం, పార్టీ ఫిరాయింపులపై సుప్రీంకోర్టు స్పీకర్ కు 3 నెలల గడువు విధిస్తూ తీర్పు వెలువరించడం, బీసీ రిజర్వేషన్ల విషయంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో ఈ భేటీకి ప్రాదాన్యత ఏర్పడింది. ముఖ్యంగా బీఆర్ఎస్ విషయంలో కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వం చేస్తున్న ప్రచారాన్ని ధీటుగా స్పందించే విషయంలో కార్యచరణపై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే కరీంనగర్ లో బీఆర్ఎస్ నిర్వహించ తలపెట్టిన బీసీ సభలో కూడా ఈ భేటీలో చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా నిన్న దాదాపు 10 గంటల పాటు సుదీర్ఘంగా పార్టీ నేతలతో కేసీఆర్ చర్చలు జరిపారు. అయితే వరుసగా రెండో రోజు పార్టీ నేతలతో కేసీఆర్ సమావేశం కావడం ఆసక్తిగా మారింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్