సోదరులు, బామ్మర్ది కోసం ఫ్యూచర్ సిటీనా.. CMపై కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు
హైదరాబాద్, 1 ఆగస్టు (హి.స.) ఫార్మాసిటీ రైతులు పోరాటంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ (KTR) సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ''X'' (ట్విట్టర్) వేదికగా స్పందించారు. ఇచ్చిన హామీలను విస్మరించడం, చట్టాన్ని దుర్వినియోగం చేయడం, అధకారిక వేదిం
Ktr


హైదరాబాద్, 1 ఆగస్టు (హి.స.) ఫార్మాసిటీ రైతులు పోరాటంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ (KTR) సోషల్ మీడియా ప్లాట్ఫామ్ 'X' (ట్విట్టర్) వేదికగా స్పందించారు. ఇచ్చిన హామీలను విస్మరించడం, చట్టాన్ని దుర్వినియోగం చేయడం, అధకారిక వేదింపులు, సిగ్గులేని భూ కబ్జాలు కాంగ్రెస్ పాలనలో నాలుగు మూల స్తంభాలంటూ ఫైర్ అయ్యారు. లగచర్ల గిరిజన రైతులైనా, కంచ గచ్చిబౌలి అటవీ భూములైనా.. నేటి హైదరాబాద్ ఫార్మా సిటీ కోసం సేకరించిన భూములైనా సర్కార్ దురగతాలు ఒక్కటేనని అభివర్ణించారు. ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం ఫార్మా సిటీ రైతుల భూములను తిరిగివ్వాలని సీఎం రేవంత్ రెడ్డిని డిమాండ్ చేశారు. ప్రభుత్వం వారితో చర్చలకు ఎందుకు వెళ్లడం లేదని ప్రశ్నించారు. ఈ నిలువునా మోసం చేసి.. అనుముల సోదరులు.. రేవంత్ బావమరిది కోసం ఫ్యూచర్ సిటీని నిర్మించాలని ప్లాన్ చేస్తున్నారా అని కేటీఆర్ కామెంట్ చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్


 rajesh pande