ఫేస్ రికగ్నిషన్తో టీచర్ల హాజరు.. నేటి నుంచి అమల్లోకి..!
హైదరాబాద్, 1 ఆగస్టు (హి.స.) ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న టీచర్లకు ఫేషియల్ రికగ్నైజేషన్ సిస్టమ్ (ఎస్ఆర్ఎస్) అమలు చేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని స్కూళ్లలో ఈ ప్రక్రియ ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేసింది. గతేడాది ఫిబ్రవరి నుంచి పెద్దపల్లి
ఫేస్ రికగ్నిషన్తో


హైదరాబాద్, 1 ఆగస్టు (హి.స.)

ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న టీచర్లకు ఫేషియల్ రికగ్నైజేషన్ సిస్టమ్ (ఎస్ఆర్ఎస్) అమలు చేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని స్కూళ్లలో ఈ ప్రక్రియ ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేసింది. గతేడాది ఫిబ్రవరి నుంచి పెద్దపల్లి జిల్లాలో విజయవంతంగా అమలవుతోంది. రాష్ట్రంలోని స్కూల్ ఎడ్యుకేషన్ పరిధిలోని ప్రభుత్వ, లోకల్బాడీ, కేజీబీవీ, మోడల్ స్కూల్స్, యూఆర్ఎస్, సొసైటీ గురుకులాల్లో 1.20 లక్షల మంది టీచర్లు పనిచేస్తున్నారు. దాదాపు అందరు టీచర్లు ఫోన్లలో స్కూల్ ఎడ్యుకేషన్ యాప్ ఉంది. దీని ఆధారంగానే ఇటీవల నిర్వహించిన టీచర్ల ట్రైనింగ్ వివరాలను నమోదు చేశారు. గురువారం టీచర్లంతా ఈ యాప్లో వివరాలను, ఫొటోలను అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. హెడ్మాస్టర్ లాగిన్లో డీటెయిల్స్ ఎంట్రీ చేయనున్నారు. ఇప్పటికే ఎఫ్తార్ఎస్ అటెండెన్స్పై ఉన్నతాధికారులు డీఈఓలకు డెమో కూడా ఇచ్చారు.

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్


 rajesh pande