దిల్లీ: 1 ఆగస్టు (హి.స.)
భారత్‌పై 25శాతం సుంకాలతోపాటు పెనాల్టీ విధిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటన చేసిన సంగతి తెలిసిందే (India-US Relations). అంతటితో ఆగకుండా భారత్, రష్యా బంధంపై అక్కసు వెళ్లగక్కారు. ఈ పరిణామాలపై భారత్ నిరాశకు గురైందని, రక్షణ రంగ ఒప్పందాల (Defense Deals) ఆమోదం విషయంలో ముందుకువెళ్లాలనుకోవడం లేదని అంతర్జాతీయ మీడియా కథనం బ్లూమ్‌బర్గ్ నివేదిక పేర్కొంది. దాని ప్రకారం..
భారత ప్రభుత్వం వాణిజ్య చర్చలు కొనసాగించాలని కోరుకుంటోంది. అగ్రరాజ్యం నుంచి కొనుగోళ్లను పెంచే మార్గాలను అన్వేషిస్తోందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. సహజవాయువు కొనుగోళ్లను కమ్యూనికేషన్ పరికరాలు, బంగారం దిగుమతులను పెంచే అంశాన్ని పరిశీలిస్తోంది. రానున్న మూడునాలుగేళ్లలో ఈ కొనుగోళ్ల కారణంగా అమెరికాతో భారత్‌కున్న వాణిజ్య మిగులు కొంతమేర తగ్గే అవకాశం ఉంది. ట్రంప్ టారిఫ్స్‌కు తక్షణమే దీటుగా బదులిచ్చే యోచన మాత్రం చేయడం లేదని సమాచారం
3
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ