నెల్లూరు, 1 ఆగస్టు (హి.స.)
ఏపీ(Andhra Pradesh) మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి నిన్న(గురువారం) నెల్లూరు జిల్లాలో పర్యటించిన విషయం తెలిసిందే. అయితే.. గతంలో వైఎస్ జగన్ పర్యటనలో జరిగిన సంఘటనల నేపథ్యంలో నెల్లూరు పర్యటనకు షరతులతో కూడిన అనుమతి ఇచ్చారు. దీంతో నెల్లూరు నగర వ్యాప్తంగా ఆంక్షలు అమలు చేశారు.
కానీ.. మాజీ సీఎం వైఎస్ జగన్(Former CM YS jagan) నెల్లూరు చేరుకున్నారని తెలియగానే వైసీపీ శ్రేణులు ఒక్కసారిగా రోడ్లపైకి భారీగా తరలివచ్చి.. పోలీసులను తోసుకుంటూ వెళ్లాలనే ప్రయత్నం చేశారు. ఈ తరుణంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు నిబంధనలు ఉల్లంఘించడంతో పోలీసులు మూడు కేసులు నమోదు చేశారు.
మాజీ మంత్రి ప్రసన్న కుమార్ రెడ్డి(Former Minister Prasanna Kumar Reddy) ఇంటికెళ్లే రోడ్డు వద్ద పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను వైసీపీ నాయకులు, కార్యకర్తలు తొలగించి తోసుకుంటూ వెళ్లారు. ఈ క్రమంలో అక్కడే ఉన్న కావలికి చెందిన స్పెషల్ బ్రాంచ్ హెడ్ కానిస్టేబుల్ మాలకొండయ్య బారికేడ్ కింద పడిపోయారు. దీంతో ఆయన చేయి విరిగింది.
ఈ ఘటన పై ప్రసన్న, బొబ్బల శ్రీనివాస్ యాదవ్, పాతపాటి ప్రభాకర్ తదితరులపై పోలీసులు కేసు నమోదు చేశారు. అలాగే, నిబంధనలకు విరుద్ధంగా బైక్ ర్యాలీ చేపట్టినందుకు దర్గామిట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. వైఎస్ జగన్(YS Jagan) పర్యటన సందర్భంగా రోడ్డు పై ధర్నా చేసి ట్రాఫిక్‌కు ఇబ్బంది కలిగించినందుకు నల్లపరెడ్డి ప్రసన్న, మరికొందరిపై దర్గామిట్ట పోలీసులు కేసు ఫైల్ చేశారు.
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి