నౌకాదళం చేతికి ‘హిమగిరి
కోల్‌కతా: 1 ఆగస్టు (హి.స.)అధునాతన గైడెడ్‌ మిసైల్‌ ఫ్రిగేట్‌ యుద్ధనౌక ‘హిమగిరి’ భారత నౌకాదళం చేతికి అందింది. కోల్‌కతాలోని గార్డెన్‌రీచ్‌ షిప్‌బిల్డర్స్‌ అండ్‌ ఇంజినీర్స్‌ (జీఆర్‌ఎస్‌ఈ) సంస్థ దీన్ని రూపొందించింది. ప్రాజెక్ట్‌-17ఏ కింద ఈ సంస్థ నిర్మించ
Two indigenous warships and submarine Vagshir to be inducted into Navy fleet next month


కోల్‌కతా: 1 ఆగస్టు (హి.స.)అధునాతన గైడెడ్‌ మిసైల్‌ ఫ్రిగేట్‌ యుద్ధనౌక ‘హిమగిరి’ భారత నౌకాదళం చేతికి అందింది. కోల్‌కతాలోని గార్డెన్‌రీచ్‌ షిప్‌బిల్డర్స్‌ అండ్‌ ఇంజినీర్స్‌ (జీఆర్‌ఎస్‌ఈ) సంస్థ దీన్ని రూపొందించింది. ప్రాజెక్ట్‌-17ఏ కింద ఈ సంస్థ నిర్మించే మూడు యుద్ధనౌకల్లో ఇది మొదటిది. వీటి విలువ రూ.21,833.36 కోట్లు. హిమగిరి యుద్ధనౌక పొడవు 149 మీటర్లు కాగా బరువు 6,670 టన్నులు. ఇందులో బ్రహ్మోస్, బరాక్‌-8 క్షిపణులు ఉంటాయి. ఈ యుద్ధనౌక.. నింగి, సముద్రతలంలోని లక్ష్యాలను ఛేదించగలదు. సాగరగర్భంలోని జలాంతర్గాములను వేటాడగలదు. హిమగిరి రాకతో భారత నౌకాదళ దాడి సామర్థ్యం మరింత మెరుగుపడుతుందని అధికార వర్గాలు తెలిపాయి.కోల్‌కతా: అధునాతన గైడెడ్‌ మిసైల్‌ ఫ్రిగేట్‌ యుద్ధనౌక ‘హిమగిరి’ భారత నౌకాదళం చేతికి అందింది. కోల్‌కతాలోని గార్డెన్‌రీచ్‌ షిప్‌బిల్డర్స్‌ అండ్‌ ఇంజినీర్స్‌ (జీఆర్‌ఎస్‌ఈ) సంస్థ దీన్ని రూపొందించింది. ప్రాజెక్ట్‌-17ఏ కింద ఈ సంస్థ నిర్మించే మూడు యుద్ధనౌకల్లో ఇది మొదటిది. వీటి విలువ రూ.21,833.36 కోట్లు. హిమగిరి యుద్ధనౌక పొడవు 149 మీటర్లు కాగా బరువు 6,670 టన్నులు. ఇందులో బ్రహ్మోస్, బరాక్‌-8 క్షిపణులు ఉంటాయి. ఈ యుద్ధనౌక.. నింగి, సముద్రతలంలోని లక్ష్యాలను ఛేదించగలదు.

సాగరగర్భంలోని జలాంతర్గాములను వేటాడగలదు. హిమగిరి రాకతో భారత నౌకాదళ దాడి సామర్థ్యం మరింత మెరుగుపడుతుందని అధికార వర్గాలు తెలిపాయి.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande