షార్‌ డైరెక్టర్‌గా పద్మకుమార్‌
శ్రీహరికోట, 1 ఆగస్టు (హి.స.)భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రమైన సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ షార్‌ డైరెక్టర్‌గా ఈఎస్‌ పద్మకుమార్‌ను నియమిస్తూ ఇస్రో ఛైర్మన్‌ డాక్టర్‌ నారాయణన్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటి వరకు ఈ స్థానంలో పనిచేసిన ఆర్ముగం రాజరాజన్‌ను తిర
షార్‌ డైరెక్టర్‌గా పద్మకుమార్‌


శ్రీహరికోట, 1 ఆగస్టు (హి.స.)భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రమైన సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ షార్‌ డైరెక్టర్‌గా ఈఎస్‌ పద్మకుమార్‌ను నియమిస్తూ ఇస్రో ఛైర్మన్‌ డాక్టర్‌ నారాయణన్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటి వరకు ఈ స్థానంలో పనిచేసిన ఆర్ముగం రాజరాజన్‌ను తిరువనంతపురంలోని విక్రమ్‌ సారాభాయ్‌ స్పేస్‌ సెంటర్‌(వీఎస్‌ఎస్‌సీ)కు డైరెక్టర్‌గా బదిలీ చేశారు. పద్మకుమార్‌ ప్రస్తుతం ఇస్రో ఇనర్షియల్‌ సిస్టమ్స్‌ యూనిట్‌(ఐఐఎస్‌యూ) డైరెక్టర్‌గా పని చేస్తున్నారు. ఈయన గతంలో పలు డైరెక్టర్‌ పోస్టులతో పాటు వీఎస్‌ఎస్‌సీలో కీలక పదవులు నిర్వహించారు.

5

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande