దిల్లీ 1 ఆగస్టు (హి.స.)
భారత్‌పై అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రష్యా నుంచి భారతదేశం చమురు కొనుగోలు చేయడం ఏ మాత్రం బాగోలేదని.. ఈ పరిణామం కచ్చితంగా చికాకు కలిగించే అంశం అని రూబియో పేర్కొన్నారు. రష్యా దగ్గర భారత్ చమురు కొనడంతోనే పుతిన్ రెచ్చిపోయి.. ఉక్రెయిన్‌పై యుద్ధాన్ని కొనసాగిస్తున్నారని చెప్పుకొచ్చారు. ఇదే భారత్‌తో చర్చల్లో తమను ఇబ్బందిపెట్టే అంశమని వ్యాఖ్యానించారు.
రష్యాతో సంబంధాలు పెట్టుకున్నందుకు ట్రంప్ భారతదేశంపై 25 శాతం సుంకాన్ని విధించారు. అంతేకాకుండా రష్యా దగ్గర సైనిక పరికరాలు, ఇతర కొనుగులు చేస్తే అదనపు జరిమానా కూడా విధిస్తామంటూ ట్రంప్ హెచ్చరించారు. ఉక్రెయిన్‌లో దాడులు ఆపాలని ప్రపంచమంతా గొంతెత్తి అరుస్తుంటే.. రష్యాతో భారత్ సంబంధాలు పెట్టుకోవడం ఏ మాత్రం బాగోలేదన్నారు. తాజాగా రూబియో కూడా భారత్‌పై రుసరుసలాడారు. రష్యా దగ్గర చమురు కొనుగోలు చేయడంతోనే ఉక్రెయిన్‌పై పుతిన్ యుద్ధం కొనసాగిస్తున్నారని.. దీనికి భారతదేశమే కారణం అన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు