న్యూఢిల్లీ: 1 ఆగస్టు (హి.స.)
బీహార్ అసెంబ్లీ ఎన్నికల ముందు ఓటర్ లిస్ట్‌పై తీవ్ర రగడ నడుస్తోంది. కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక సర్వేపై విపక్షాలు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నాయి. ఎన్డీఏ కూటమికి అనుకూలంగా ఎన్నికల సంఘం సర్వే చేపట్టిందంటూ ప్రతిపక్షాలు ఆందోళన చేస్తు్న్నాయి. అటు పార్లమెంట్ ఉభయ సభల్లోనూ.. ఇటు బీహార్ అసెంబ్లీలోనూ తీవ్ర రగడ నడుస్తోంది. తక్షణమే సర్వే నిలిపివేయాలంటూ ఆందోళన నిర్వహిస్తున్నాయి. అయితే నకిలీ ఓట్లను మాత్రమే తొలగిస్తున్నట్లు ఈసీ చెప్పుకొస్తోంది.
ఇదిలా ఉంటే శుక్రవారం సాయంత్రం బీహార్ ఓటర్ జాబితాను ఎన్నికల సంఘం విడుదల చేయనుంది. గతంలో సుమారు 8 కోట్ల మంది ఓటర్లు ఉండగా.. ప్రస్తుతం 7 కోట్లు 35 లక్షల ఓటర్లుగా ఉన్నట్లు నిర్ధారించారు. ఇక అభ్యంతరాలు, ఫిర్యాదుల పర్వం పూర్తయిన తర్వాత సెప్టెంబరు 30న తుది జాబితా విడుదల చేయనుంది. సెప్టెంబర్ 1వ తేదీ వరకు ఫిర్యాదులు, అభ్యంతరాలతో పాటు ఓటరుగా నమోదు చేసుకునే అవకాశం కల్పించింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు